ఇంకా విడాకులు మంజూరుకాని కేంద్రమంత్రి చిరంజీవి అల్లుడు శిరీష్ భరద్వాజ బిజెపిలో చేరారు
చిరంజీవి రెండోకూతురు శ్రీజ ను ప్రేమించి పెళ్ళాడిన శిరీష్ నుంచి ఆతరువాత భార్య దూరమై తండ్రి ఇంట్లోనే వుంటోంది. చిరంజీవి కుటుంబానికి ఈ వివాహం నచ్చలేదు. శ్రీజ పుట్టాకే ఆకుటుంబానికి బాగా కలసివచ్చిందంటారు. ఆ అమ్మాయి ఇంటినుంచి దూరమయ్యాక చిరంజీవి ప్రజారాజ్యం విఫలమైంది. పార్టీని నడపలేని స్ధితిలో సతమతమౌతూండగా భర్తతో తగాదాపడిన శ్రీజ పుట్టింటికి వచ్చేసింది. ఆతరువాతే చిరంజీవి కాంగ్రెస్ లో కలిసిపోయారు. కేంద్రంలో మంత్రి అయ్యారు. ఈ'అదృష్టమంతా' శ్రీజ వల్లేనని చిరంజీవి అభిమానులు పిచ్చిగా నమ్ముతారు. శిరీష్ దగ్గరకంటే తమదగ్గరే అమ్మాయి వుండటం మంచిదనుకున్నారో ఏమోగాని...ఆలుమగల తగాదా విడాకుల కోర్టుకెక్కింది. ఇంకా విచారణ జరుగుతూనే వుంది
శిరీష్ ఒక వ్యక్తిగా సాదాసీదా మనిషే అయినా చిరంజీవి అల్లుడిగా సెలబ్రెటీ అయిపోయాడు. రాజకీయపార్టీల కన్ను ఆ యువకుడి మీదుంది. చివరికి బిజెపితో జతకట్టాడు. 200 మంది కుర్రవాళ్ళతో హడావిడిగా శుక్రవారం రాజకీయ ప్రవేశం చేశాడు
యువతలోదేశభక్తిని నింపడం బిజెపి వల్లే అవుతుందని నరేంద్రమోడీ కిషన్ రెడ్డి ఇన్ స్పైరర్లని అంటున్న శిరీష్ సభికులను ఖచ్చితంగా కొంతకాలం ఆకర్షిస్తారు
No comments:
Post a Comment