Tuesday, March 26, 2013

కాకినాడలో లోకేష్ సభ!

తెలుగుదేశం పార్టీ విద్యార్ధి విభాగం విసృ్తత సమావేశం ఏప్రిల్ 1 న కాకినాడలో ఏర్పాటైంది. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఏకైక సంతానమైన లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీలో ఉన్నత స్ధాయి వర్గాల ద్వారాతెలిసింది.

హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, హెరిటేజ్ వ్యవసాయదారుల సంక్షేమ ట్రస్ట్ ట్రస్టీ, తెలుగుదేశం కార్యకర్త, నగదుబదిలీ పధకం ప్రచారకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారాలోకేష్ ఇప్పటికే పార్టీ సంస్ధాగత వ్యవహారాలను చూస్తున్నారు. యువతరాన్ని పార్టీ వైపు ఆకర్షించడానికి లోకేష్ కు క్రియాశీలక బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఏదోఒకరోజు ఆయన చురుకైన బాధ్యతలు తీసుకుంటారని ఊహిస్తున్న సమయంలో గతనెల పలమనేరు కార్యకర్తల సమావేశంలో
అనూహ్యంగా 9 నిమిషాల పాటు తొలి రాజకీయ ఉపన్యాసం చేశారు.



"ఆవిధంగా ముందుకి పోతున్నాం" ,"ఏదైతే వుందో" లాంటి ఊతపదాలేవీ లేకుంకా సూటిగా స్పష్టంగా లోకేష్ తొలి ఉపన్యాసం ముగిసింది.

ఎన్నెన్నో ఇన్ పుట్స్ తో ఇంటర్నల్ ఆర్గనైజేషన్ చూస్తున్న ఈ స్టాన్ ఫోర్డ్ బిజినెస్ స్కూల్ విద్యార్ధికి డాటాను విశ్లేషించుకోవడం చాలా పరిమితంగా కామెంట్స్ చేయడం అలవాటు. కేవలం 140 ఇంగ్లీషు అక్షరాలతో ట్విట్టర్ లో ఈయన అపుడపుడూ చేసే కామెంట్స్ తీవ్రంగా వుంటాయి.

అలాంటి నారాలోకేష్ కు కాకినాడ కార్యక్రమం రెండో సభ అవుతుంది


సంక్రాంతి తరువాత ...భూమి మీద ఉత్తరం వైపు సూర్యుడు ప్రయాణిస్తాడు. ఇది నిన్నే మొదలైందని లేక్కవేస్తున్నారు...ఆ లెక్కకు సాక్ష్యం గావున్న ఫొటో ఇది