తడి ఆర్చుకుపోయినపుడు, రక్తంలో అక్సిజన్ అంతరించి శరీరంలో ఏఅవయవానికీ పోషకపదార్ధం అందని స్ధితే వడదెబ్బకు మరణించడం అంటే. విపరీతమైన ఎండ శరీరంలో తడిని ఆవిరిచేస్తూంది. చెమటలు పట్టంలేదు కాబట్టి సురక్షితమనుకుంటే పొరపాటే! ఎండమండిపోతున్నా దాహంవేయడంలేదు కాబట్టి నీళ్ళుతాగఖ్ఖరలేదనుకుంటే ప్రాణాంతకమే! విజ్ఞానం సాధించిన మనుషులకు ఇది ఎంతవరకూ అర్ధమైందో తెలియదుకాని, ప్రకృతే నేర్పిన జ్ఞానంతో తేనెటీగలు తడారిపోకుండా తమను తాము కాపాడుకుంటున్న ఈ సన్నివేశం సమస్త ప్రాణులకూ ఎండలగండాన్ని సూచిస్తోంది.
Saturday, May 25, 2013
Wednesday, May 22, 2013
ఇంకా గౌరవంగా, కాస్తమర్యాదగా...
పాతేస్తే మన్నూ, కాల్చేస్తే బూడిదా అనేమాటనిజమేకాని ప్రాణం పోయిన మనిషి అంతిమ యాత్ర ఇంత దారుణంగా వుండటం సమాజపు నాగరీకతకీ, మనిషి సంస్కారానికీ మాయని మచ్చలుగానే వుండిపొతాయి. తూర్పుగోదావరిజిల్లా లో రైలునుంచి జారిపడి చనిపోయిన వ్యక్తి పోస్టుమార్టమ్ కోసం సైకిల్ మీద వేలాడదీసి తరలిస్తున్న సన్నివేశమిది. అనాధమృతదేహాలకీ, ఎన్ కౌంటర్లలో చనిపోయినవారి మృతదేహాలకీ - చచ్చిపోయిన పశువుల్ని ఈడ్చేయడానికీ పెద్దతేడా వుండదు. సంక్షేమకార్యక్రమాలకి వేలు లక్షల కోట్లరూపాయలు ఖర్చుచేస్తున్నప్రభుత్వాలు మనిషి అంతిమ యాత్ర కాస్త మర్యాదగా కాస్త గౌరవంగా పూర్తయ్యే ఏర్పాట్లు చేస్తే బాగుండును!
Subscribe to:
Posts (Atom)