Thursday, March 21, 2013

కరుణ నాటకీయం

అద్భుతమైన సి్క్రప్ట్ రైటర్ కరుణానిధి తెరముందు కొచ్చి నాటకీయగా రాజకీయాల్లోముఖ్యపాత్ర అందుకున్నారు. డైలాగులనిపించే ఆయన మాటల్లో విజయాల ప్రస్తుతి అజేయాల స్తుతి వుంటాయి. కరుణానిధి వ్యాఖ్యానాల వెనుక ఏదో నిగూఢత వుంటుందని చెన్నై జర్నలిస్టులు పసిగట్టేస్తూవుంటారు.

"సూర్యుడున్నంత వరకూ భూమి మీద జీవరాశుల మనుగడ సాగిపోతూనే వుంటుంది. సూర్యుణ్ణి ఏ ఒక్కరూ సొంతం చేసుకోలేరు. ఆప్రయత్నం చేసిన హనుమంతుడు మూతి కాల్చుకోవడం మనకు తెలుసు" (ఉదయిస్తున్న సూర్యుడు డి ఎం కె చిహ్నం) కరుణానిధి చేసిన ఈ వ్యాఖ్యానాలు మరుసటిరోజే పేపర్లలో వచ్చాయి. ఆరోజే యు పి ఎ కి - డి ఎం కె మద్దతు ఉపసంహరణను కరుణానిధి ప్రకటించారు

2 జి స్పెక్ట్రమ్ కేసులో కేంద్రమంత్రులుగా వున్న రాజాని కుమార్తెనూ అరెస్టు చేసి జైలుకి పంపినప్పటినుంచీ రగిలిపోతున్న ఆగ్రహాన్ని అణచుకున్న కరుణానిధి సమయం చూసి దెబ్బకొట్టారు. "సూర్యుడు" ఎవరి వశమూ కాదని ఓ సంకేతమిచ్చి మరీ యుపిఎ కాళ్ళు విరిచే పనికి పూనుకున్నారు




ఉన్నది కాంగ్రెస్ లో షికారు జగన్ తో మరో 38 మంది ఎమ్మల్యేలు!

ఏకంగా 47 మంది కాంగ్రెస్ ఎమ్మల్యేలు వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి హాజరుకాకపోవటం చిన్న విషయం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యల తీవ్రతను బయటపెట్టేదే. గైర్ హాజరైన వారి సంఖ్యను మీడియా పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా వుంది
కాంగ్రెస్ ఎమ్మెల్యెల్లో ఇప్పటికే బయట పడిన వారు మినహా మరో 38 మంది మద్దతు జగన్ కి వుంటుందనీ లేదా వారంతా కిరణ్ కుమార్ ని వ్యతిరేకిస్తున్నారనీ అర్ధమౌతోంది
తిరగబడిన శత్రువుకంటే లోపలే వుండి వ్యతిరేకించే శక్తులే అధికార పీఠానికి ప్రమాదకరం. క్రమంగా ప్రజల్లోకి చొచ్చుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ 16 వ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి లోపలే వుండి వ్యతిరేకించేవారి సంఖ్య పెరుగుతున్నట్టుంది.
34మంది మంత్రులు పాతికమంది ఎమ్మెల్సీలు హాజరైన నిన్నటి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి 146 మంది ఎమ్మేల్యేలలో 65 మందే హాజరయ్యారని జర్నలిస్ట్ మిత్రుడొకరు చెప్పారు. 47 మంది మీటింగ్ ఎగ్గొట్టారు.
అవిశ్వాస తీర్మానం విషయంలో తెలుగుదేశంపార్టీ తటస్ధత ను పాటించడం తో కిరణ్ కుమార్ ఆపార్టీ మద్దతుకూడా పరోక్షంగా పొందినట్టయింది. ఇందిరమ్మబాట లాంటి ఇంటరాక్టివ్ యాత్రలు నామినేటెడ్ ముఖ్యమంత్రిని
ప్రజల్లోకితీసుకువెళుతున్నాయి. సహకారఎన్నికలు ఆయన్ని ఢిల్లీలో కాలర్ ఎగరేసుకునేలా చేశాయి. ఎస్ సిలకు ప్రవేశపెట్టిన సబ్ ప్లాన్ సమాజంలో అన్ని వర్గాలూ కిరణ్ వైపు ఆసక్తిగా ఆశగా చూసేలాచేసింది. జనరల్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి మార్చే అవకాశాలు వుండవని కూడా అందరికీ తెలిసిందే.
ఇన్ని అనుకూలతలు బలపడుతున్న కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సి ఎల్ పి సమావేశానికి 47 మంది వెళ్ళకపోవడం రెండు విధాలుగా అర్ధమౌతోంది
ఒకటి అందరినీ కలుపుకుని వెళ్ళలేని కిరణ్ కుమార్ స్వభావం. సమావేశానికి వెళ్ళకపోయినా పదవులు ఊడిపోవు కనుక అటువంటి నాయకుడి వద్దకు వెళ్ళడానికి ఆత్మాభిమానం అడ్డు పడటం
రెండు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనబడుతున్న ప్రజాభిమానం చూసి ఆపార్టీవైపు చేరిపోవాలన్న ఆలోచనతో మరిన్ని'బంధాలు' తగిలించుకోకుండా గైర్ హాజరవ్వడం
కారణమేదైనా కాంగ్రస్ నుంచి ఎన్నికైన వారిలో 47 మంది గోడమీద పిల్లుల్లా వున్నరనుకోవలసి వస్తోంది. వీరిలో అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసిన 9 మందినీ మినహాయిస్తే 38 మందీ జగన్ పార్టీ వైపు చూస్తున్నారనే అర్ధమౌతోంది


Monday, March 18, 2013

*రాష్ట్రప్రజల తలసరి ఆదాయం 7 ఏళ్ళలో 3 రెట్లు పెరిగి 71 వేలకు చేరుకుందని ఆర్ధిక మంత్రి ప్రకటించారు *వ్యవసాయ బడ్జెట్ పేరుతో సభను తప్పుదారి పట్టించినందుకు లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్ హక్కుల నోటీసు ఇచ్చారు *కాంగ్రెస్ హామీలైన 9 గంటల వ్యవసాయ విద్యుత్ తలకు 6 కిలోల బియ్యం ప్రస్తావనే బడ్జెట్ ప్రతిపాదనల్లో లేదు

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ విశేషాలు

*రాష్ట్రప్రజల తలసరి ఆదాయం 7 ఏళ్ళలో 3 రెట్లు పెరిగి 71 వేలకు చేరుకుందని ఆర్ధిక మంత్రి ప్రకటించారు

*వ్యవసాయ బడ్జెట్ పేరుతో సభను తప్పుదారి పట్టించినందుకు లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్ హక్కుల నోటీసు ఇచ్చారు

*కాంగ్రెస్ హామీలైన 9 గంటల వ్యవసాయ విద్యుత్ తలకు 6 కిలోల బియ్యం ప్రస్తావనే బడ్జెట్ ప్రతిపాదనల్లో లేదు

ప్రజల తలసరి ఆదాయం 77212 రూపాయలకు చేరిందని,ప్రభుత్వ విధానాల వల్ల ఇది సాధ్యమైందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్రబడ్జెట్టుని ఈ రోజు శాసన సభలో ప్రవేశపెడుతూ ప్రకటించారు.

2004 లో తలసరి ఆదాయం 25 వేల రూపాయలుగా ఉండగా ఇప్పుడు అది మూడురెట్లు పెరిగిందని చెప్పారు.

స్థూల ఉత్పత్తి ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్లుగా లెక్కగట్టామన్నారు. ఇది కూడా రెండువేల నాలుగుతో పోల్చితే నాలుగు లక్షల కోట్ల పెరుగుదల ఉందన్నారు.

పారిశ్రామిక ప్రగతిలో పదిన్నర శాతం,సేవల రంగంలో 11.5 శాతం, వ్యవసాయంలో 5.5 శాతం పెరుగుదల ఉందన్నారు.

మంత్రిగారు చెబుతున్న దాని ప్రకారం రాష్ట్రం మంచి పురోగతిలో పయనిస్తోంది. ఇంతటి ప్రగతి వుంటే ప్రజల జీవన ప్రమాణాలుపెరగాలి. కొనుగోలు శక్తులు ఎంతో కొంత పెరగాలి. కానీ అదేమీ కనిపించడం లేదు. అలాగని మంత్రిగారు అబద్దం చెబుతున్నారనుకోలేము

కాకపోతే ప్రగతి ఫలాలన్నీ ప్రజలందరికీ కాక సంపన్న వర్గాలకే అందుతున్నాయనీ, అసలు ప్రయివేటు రంగం సాధించిన ప్రగతినే రాష్ట్రమంతటికీ ఆపాదించి బడ్జెట్ లో చూపించానీ అనుకోవలసి వస్తోంది.

మరోవైపు వ్యవసాయానికి ప్రత్యేకంగా బడ్జెట్ పెడుతున్నామని గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వం సాంకేతికంగా ఇరుకున పడింది.ఏ నిబంధన కింద వ్యవసాయ ప్రణాళికను బడ్జెట్ సమయంలో ప్రవేశపెట్టారని లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయన ప్రశ్నించారు.దీనిపై ఆయన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.

నిబంధనలు అంగీకరించవని తెలిసి కూడా వ్యవసాయ బడ్జెట్పై ప్రబుత్వం ఎందుకు గొప్పులు పోయిందని ఆయన అన్నారు.ఇది ప్రజలను తప్పు దోవ పట్టించడమేనని వ్యవసాయ బడ్జెట్ అంటూ గొప్పలకు పోయిన రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికంగా ఇరుకున పడింది.ఏ నిబంధన కింద వ్యవసాయ ప్రణాళికను బడ్జెట్ సమయంలో ప్రవేశపెట్టారని లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ్ ప్రశ్నించారు.

దీనిపై ఆయన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలైన మనిషికి 6 కిలోల బియ్యం, వ్యవసాయానికి 9 గంటలవిద్యుత్ ప్రస్తావనే బడ్జెట్ లో లేదు. ఈశాసన సభముగిసేలోగా మరో బడ్జెట్ కు అవకాశం లేదు కాబట్టి కాంగ్రస్ ప్రజల కిచ్చిన మాట తప్పినట్టే!





టేబుల్ టెన్నిస్ ను పట్టణ మధ్య తరగతికి చేర్చిన భాస్కర్ రామ్ జాతీయ ఉపాధ్యక్షుడు

టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రసిడెంట్ గా వి.భాస్కర్ రామ్ ఎన్నికయ్యారు

రాజమండ్రి పౌరప్రముఖుడు, తీరికలేని ఛార్టెడ్ ఎకౌంటెంట్, స్వయంగా క్రీడాకారుడు అయిన భాస్కర్ రామ్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

లక్నోలో 17 3 2013 సాయంత్రం ఈయన్ని నేషనల్ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అంతేకాకుండా నేషనల్ టేబుల్ టెన్నిస్ డెవలప్ మెంటు కమిటి ప్రసిడెంటుగా కూడా నియమించారు.

పట్టణ సంపన్న వర్గాలకే పరిమితమైవున్న టేబుల్ టెన్నిస్ ను మనరాష్ట్రంలో మధ్యతరగతి వర్గాల్లోకి రావడం వెనుక భాస్కర్ రామ్ నిబద్ధత ఆచరణాత్మకమైన కృషి వున్నాయి. రాజమండ్రిలో ఈయన నిర్వహించిన జాతీయ టేబుల్ టెన్నిస్ పోటీలు ఎందరెందరో టీనేజర్లనువిశేషంగా ప్రభావితంచేశాయి. మరే పట్టణంలోనూలేనంత హెచ్చు మంది టిటి ప్లేయర్లు రాజమండ్రిలో వున్నారంటే ఆ క్రెడిట్ భాస్కర్ రామ్ దే!



'మగ'నామోషీ పక్కన పెడితే.....

...కౌన్సెలింగ్ కు సిద్ధమైతే
దాంపత్య సమస్య చాలావరకూ పరిష్కారం?

Sunday, March 17, 2013

గోదావరి జిల్లా ఘనతే!

గాలీ...నేలా...రుచీ
మర్యాదా...మన్ననా


ఇ-స్టయిలే... రోజువారీ అవసరాలకు అనుభవాల నుంచి ఐటి సొల్యూషన్లు



అవిశ్వాసం తీర్మానం: ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు? Test

నిజానికి, అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి ముందే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నెగ్గింది. ఈ విషయం తెలిసి కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి, చర్చకు తీసుకుని వచ్చాయి. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించి ఉంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చెమటలు పట్టి ఉండేవి. ఆ ఆందోళన నుంచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని చంద్రబాబు చాలా ముందుగానే బయటపడేశారు.
అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వబోమని ప్రకటించడం ద్వారా ముఖ్యమంత్రికి ఆయన ఊరట కలిగించారు. దాంతో ముఖ్యమంత్రిలో ఎక్కడలేని ధీమా పెరిగింది. ప్రభుత్వం బయటపడిందని తెలియగానే పోటీ తెలుగుదేశం పార్టీకి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మధ్య నెలకొంది. అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తోంది. వైయస్ విజయమ్మ సహా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ప్రధానంగా చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.
తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా వైయస్సార్ కాంగ్రెసును, ముఖ్యంగా వైయస్ రాజశేఖర రెడ్డిని, వైయస్ జగన్ను లక్ష్యంగా చేసుకుని వాగ్బాణాలు సంధించారు. మోత్కుపల్లి నర్సింహులు వైయస్ రాజశేఖర రెడ్డిని, వైయస్ జగన్ను వదిలిపెట్టలేదు. వారిద్దరిపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి విద్యుత్తు, తదితర సమస్యలపై మాట్లాడారు. తన ప్రసంగం చివరలో మాత్రం వైయస్ జగన్పై, వైయస్సార్ కాంగ్రెసుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మధ్య జరిగిన పోటీలో ఎవరు గెలిచారనేది ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీలు కూడా తమ తమ స్వరూపాలను బయటపెట్టుకున్నాయని అంటున్నారు. తెలంగాణపై వైయస్సార్ రాజశేఖర రెడ్డి వైఖరిని తెరాస సభ్యులు దుమ్మెత్తిపోశారు. అయినా, వైయస్సార్ కాంగ్రెసు వారిని పల్లెత్తు మాట అనలేదు. చంద్రబాబును మాత్రమే లక్ష్యం చేసుకుని విమర్శలు గుప్పించారు. కాంగ్రెసు సభ్యులు కూడా ఎక్కువగా వైయస్సార్ కాంగ్రెసుపై దృష్టి పెట్టారు. వైయస్ రాజశేఖర రెడ్డిని తమ నాయకుడిగా చెప్పుకుంటూనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీని దుమ్మెత్తిపోశారు.
అయితే, అవిశ్వాస తీర్మానం విషయంలో తెరాస తెలివిగా వ్యవహరించిందనే మాట వినిపిస్తోంది. మామూలుగా అయితే, తెలంగాణపై మాట్లాడడానికి సమయం దొరకదు కాబట్టి, దొరికినా ఎక్కువ సమయం దొరకదు కాబట్టి అవిశ్వాస తీర్మానాన్ని సాకుగా చేసుకుని తెలంగాణపై చెప్పాల్సిందంతా చెప్పారని అంటున్నారు. ప్రజా సమస్యలపై తెరాస సభ్యులు తక్కువగా మాట్లాడి తెలంగాణపై ఎక్కువగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెసు వైఖరిని నిలదీశారు.
పైగా, లోకసత్తా సభ్యుడు జయప్రకాష్ నారాయణ వంటి చాలా మంది ఇతర సభ్యులు తెలంగాణపై కాంగ్రెసు వైఖరిని తప్పు పట్టారు. ఆ రకంగా తెలంగాణపై విస్తృతమైన చర్చకు తెరాస అవిశ్వాస తీర్మానం ద్వారా దారులు వేసుకుందనే మాట వినిపిస్తోంది. అయితే, తమ ప్రభుత్వం చేసిన, చేస్తున్న కార్యక్రమాలను వివరించడానికి ముఖ్యమంత్రికి మంచి అవకాశం లభించిందని అంటున్నారు. మొత్తం మీద, అవిశ్వాస తీర్మానంపై ఒటింగుకు వచ్చేసరికి ముఖ్యమంత్రి అందరి దృష్టిని ఆకర్షించారు. విపక్షాలు తేలిపోయి, అధికార పక్షం నిలిచినట్లే కనిపించింది.