రాష్ట్రంలో స్ధానిక సంస్ధలకు త్వరలో ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజమండ్రిలో చెప్పారు.
సహకార ఎన్నికలలో మాదిరిగానే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా కృషిచేసి కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాలని ఆయన ఆపార్టీ నాయకులకు పిలుపు యిచ్చారు.
మంత్రి పినిపే విశ్వరూప్ పెళ్ళి రిసెప్షన్ కోసం గతరాత్రి అమలాపురం వెళ్ళిన ముఖ్యమంత్రి రాజమండ్రి చేరుకుని విశ్రమించారు. ఉదయం మంత్రి తోటనరశింహం, ఎంపిలు ఉండవిల్లి అరుణ్ కుమార్, జివి హర్షకుమార్ రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ మొదలైన నాయకులు ముఖ్యమంత్రిని కలిశారు.
సహకార ఎన్నికల్లో విజయానికి వారిని ముఖ్యమంత్రి అభినందించారు. "స్ధానిక సంస్ధల ఎన్నికలకు మన ప్రభుత్వం సిద్ధంగానే వుంది.రిజర్వేషన్ల వివాదం వల్ల ప్రతిష్టంభన లో పడ్డాము. కోర్టుతీర్పు అనుకూలంగావచ్చింది కాబట్టి ఇక సమస్యలేదు. ఎన్నికల ఏర్పాట్లు మొదలుపెడతాము" అని ముఖ్యమంత్రి వారితో అన్నారని తెలిసింది. ఆతరువాత ఆయన విమానంలో హైదరాబాద్ బయలు దేరారు
No comments:
Post a Comment