Saturday, March 2, 2013

'బడ్టెట్' తలనొప్పికి స్టాండింగ్ కమిటీలే మందు! - కిరణ్ ఐడియా






బడ్జెట్ సమావేశాల కోసం ఆంధ్రప్రదేశ్ శాసనసభ మొదటి సారిగా పార్లమెంటు తరహాలో రెండు విడతలుగా సమావేశమౌతోంది. మార్చి 13 న సమావేశాలు మొదలౌతాయి. 18 ఆర్ధికమంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు. 23 వరకూ చర్చజరుగుతుంది. ఓట్ ఆన్ అకౌంట్ తీసుకున్నాక సభవాయుదా పడుతుంది. ఏప్రిల్ 23 నమళ్ళీ సమావేశమై మే 15 వరకూ కొనసాగుతుంది.
ఓట్ ఆన్ అకౌంట్ తరువాత వాయిదా పడినప్పటినుంచీ తిరిగి సమావేశమయ్యేవరకూ వున్న విరామకాలంలో స్టాండింగ్ కమిటీలు సమావేశాలు జరుపుతాయి. శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలను సంబంధిత స్టాండింగ్ కమిటీలు క్షుణ్ణంగా చర్చించి నివేదికలు రూపొందిస్తాయి. రెండో విడత సమావేశంలో కమిటీల సూచనలు దాదాపు యధాతథంగా అమలౌతాయి. లేదా సభ సూచనమేరకు సవరణలు వుండవచ్చు.
కేంద్రబడ్జెట్ పై లోక్ సభ, రాజ్యసభ సభ్యుల తో ఏర్పాటయ్యే స్టాండిగ్ కమిటీలు చేసేపనినే ఇపుడు రాష్ట్రంలో స్టాండిగ్ కమిటీలు చేస్తాయి. ఆర్ధికమంత్రి తదితరులు ఈ తరహా ఏర్పాట్లను పరిశీలించి వచ్చాక ఇచ్చిన నివేదిక ననుసరించి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో మొదటి సారి శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులతో శాఖలవారీగా కొద్దినెలల క్రితమే స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది
ప్రతిపక్షాలు అధికారపక్షం పరస్పరం దుమ్మెత్తిపోసుకోడానికే సభాసమయం చాలని ధోరణి పెరిగిపోతూన్న కాలం కావడంతో ప్రతి బడ్జెట్ లో చాలా భాగాలు చర్చలేకుండానే ఆమోదించబడుతున్నాయి. అంశాలవారీగా ప్రతీ అంశాన్నీ సభలో చర్చించాకే బడ్జెట్ ను ఆమోదించిన సందర్భం 1990 దశకం తరువాత (తెలుగుదేశం హయాంలో) లేనేలేదు
కిరణ్ ప్రభుత్వానికి జగన్ పార్టీలో చేరి రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల బెడదవుంది. బడ్జెట్ సమావేశంలో వారు వ్యతిరేకంగా ఓటు వేస్తే రాజకీయంగానూ రాజ్యాంగపరంగానూ కూడా సమస్యలు ఎదురయ్యే ప్రమాదం వుంది. బడ్జెట్ ఆమోదం లేకుండా జీతభత్యాల వంటి కనీస అవసరాల చెల్లింపులు కూడా చేయకూడదు. ఓట్ ఆన్ అకౌంట్ ద్వారా చెల్లింపుల నుంచి గట్టెక్కవచ్చు.ఇందుకు అన్ని పార్టీలూ సహకరిస్తాయి. ఆయితే ఆతరువాత చర్చల్లో మామూలు దుమె్మత్తిపోతలకు దెప్పిపోట్లు కూడా అదనమౌతాయి.
బడ్జెట్ సమావేశపు 'మైనారిటీ' చిక్కుముడిని తప్పించుకోవడమే కాక మీడియాలో విస్తృతంగా ప్రసారమైయ్యే విమర్శలను కూడా తగ్గించుకోవచ్చన్న కిరణ్ ఐడియా పర్యావసానమే పార్లమెంటు తరహా స్టాండింగ్ కమిటీల ఏర్పాటుగా కనిపిస్తోంది
ఇందువల్లే బడ్జెట్ సమావేశాలకోసం పాదయాత్ర ఆపుకోవలసిన అవసరంలేదని ప్రధాన ప్రతిపక్షనాయకుడు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు భావిస్తున్నారా?

Friday, March 1, 2013

బడ్జెట్ కు బాబు దూరం?

బడ్జెట్ కు బాబు దూరం?

ఈ నెల 13నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉండాలని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో చేస్తున్న పాదయాత్రను శ్రీకాకుళం వరకు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారని, అందువల్ల బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు ఇంకా ఆరు జిల్లాల్లో పర్యటించాల్సి ఉందని, ఒక్కో జిల్లాలో కనీసం పది రోజుల పాటు పాదయాత్ర చేయాల్సి వుంటుందనిస అంటే మరో రెండు నెలల వరకు ఆయన హైదరాబాద్ వచ్చే ప్రసక్తే వుండకపోవచ్చునని అంటున్నారు. మహానాడు నాటికి పాదయాత్రను ముగించి వీలుంటే హైదరాబాద్లో, లేదంటే ఎక్కడ పాదయాత్ర ముగుస్తుందో అక్కడే పార్టీ మహానాడు నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగే అవకాశాలు కనిపించడం లేదని, సభలో వుండి, ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవడం కన్నా వచ్చే ఎన్నికలకు సన్నద్ధం అయ్యే విధంగా పాదయాత్ర కొనసాగించడమే మంచిదని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు భావిస్తున్నారని పార్టీ నాయకులు అంటున్నారు. తెలంగాణ అంశంపై సభను నడవనివ్వకుండా వివిధ పక్షాల సభ్యులు అడ్డుకునే పరిస్థితి ఉందని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు. చంద్రబాబు బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోతే, ప్రతిపక్ష నాయకుడిగా అలా ఉండడం ఇదే తొలిసారి అవుతుంది.



- Posted using BlogPress from my iPad



Thursday, February 28, 2013

బడ్జెట్ నేడే

ఆదాయాలు పెరగక, ఖర్చులు ఆగక పడే అవస్ధలు భారాలు మనకితెలుసు. దేశ ఆర్ధిక బడ్జెట్ కూడా అలాంటిదే. ఆర్ధిక మంత్రి చిదంబరం ఇవాళ (28-2-2013) పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇందులో పదేపదే వినిపించే పదాలు వాటి అర్ధాలు చాలామందికి తెలియదు. ఆటెర్మనాలజీని వివరించే సాక్షి డైలీ క్లిప్పింగ్స్ ఇక్కడ చూడొచ్చు

Tuesday, February 26, 2013

రైల్వే బడ్జెట్ విశేషాలు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా తిరగబోతున్న రైళ్ళు

మంగళూరు - కాచిగూడ ఎక్స్ప్రెస్ (వీక్లీ)
నిజామాబాద్ - లోకమాన్య తిలక్ (వీక్లీ)
కాకినాడ - ముంబై (వీక్లీ)
జబల్పూర్ - యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ (వీక్లీ) వయా ధర్మవరం.
కర్నూలు - సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్
తిరుపతి - పుదుచ్చేరి (వీక్లీ)
తిరుపతి-భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ (వీక్లీ) వయా విశాఖపట్నం.
విశాఖ - జోధ్పూర్ ఎక్స్ప్రెస్ (వీక్లీ).
కొల్లం ఎక్స్ప్రెస్ (వీక్లీ).
ప్యాసింజర్ రైలు నంద్యాల -కర్నూలు టౌన్ (డైలీ).

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొడిగించిన రైళ్లు
హైదరాబాద్ - దర్భాంగా ఎక్స్ప్రెస్.
హైదరాబాద్ - బెల్లంపల్లి ఎక్స్ప్రెస్ వయా సిర్పూర్, కాగజ్నగర్.

రాకపోకలు పెంచిన రైళ్ల వివరాలు...
విశాఖ - లోకమాన్యతిలక్ (వారంలో 2 రోజులు).
విశాఖ - హుజుర్సాహేబ్ నాందెడ్ ఎక్స్ప్రెస్ (వారంలో 3 రోజులు).
సికింద్రాబాద్ - మణుగూరు (వారంలో 3 రోజులు).

ఏపీలో కొత్త రైల్వే లైన్ల సర్వే ప్రతిపాదనలు...
డోర్నకల్ - మిర్యాలగూడ, సిద్ధిపేట్ - అక్కన్నపేట్, మంచిర్యాల - ఆదిలాబాద్.

ఏపీ డబ్లింగ్ ప్రతిపాదనలు...
సికింద్రాబాద్ - ముదికేడ్ - ఆదిలాబాద్, తిరుపతి - కాట్పాడి, ధర్మవరం - పాకాల, మహబూబ్నగర్ - గుత్తి.


హైదరాబాద్ 2 వ రాజధాని అయితేనే న్యాయం

హైదరాబాద్ను దేశ రెండో రాజధానిగా చేస్తే తప్ప రాష్ట్రానికి న్యాయం జరగదని తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం పేర్కొంది. కేంద్ర మంత్రి బన్సల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహల్ గాంధీలను సంతృప్తి పరిచే విధంగా ఉందని తెదేపా ఎద్దేవా చేసింది.

ఈ బడ్జెట్లోనూ రాష్ట్రానికి అన్యాయమే జరిగిందని తెదేపా మండిపడింది. ఏటికేడు ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరుగుతుందని తెదేపా దుయ్యబట్టింది.

బన్సల్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అమేథి-రాయబరేలి బడ్జెట్గా మాత్రమే ఉందని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఎద్దేవా చేశారు. తిరుపతి-షిరిడి మధ్య కొత్త రైలు ఏర్పాటు చేయాలని విన్నవించినా పట్టించుకోలేదన్న శివప్రసాద్ ఆయన తలపై తెల్ల వస్త్రం కప్పుకుని నిరసన వ్యక్తం చేశారు.

2013-14 రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు...

- ప్రస్తుత బడ్జెట్ నాటికి రైల్వే నష్టం రూ.64,600 కోట్లు
- వచ్చే ఏడాది నాటికి 14 పాత వంతెనల పునర్నిర్మాణం
- రైల్వేలు ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలనేది లక్ష్యం
- ఎ-1 స్థాయి స్టేషన్లలో 117 ఎస్కలేటర్లు, 400 లిఫ్ట్లు - టిక్కెట్ల విక్రయాలలో అక్రమాల తగ్గింపుకు ఆధార్తో అనుసంధానం
- జోనల్ రైల్వేలో ప్రయాణీకుల భద్రతకు హెల్ప్ లైన్లు -
- ఎస్సెమ్మెస్ ద్వారా రిజిస్ట్రేషన్ స్టేటస్ తెలుసుకునే అవకాశం
- మహిళల కోసం మరిన్ని కోచ్లు, హెల్ప్ లైన్ సెంటర్లు
- రైల్వేల నిర్వహణకు వనరుల వ్యయం పెరిగింది, ఆర్థికంగా భారతీయ రైల్వే నిలదొక్కుకోవాలి
- అలహాబాద్ ఘటన బాధించింది.
- 31,866 లెవల్ క్రాసింగ్ల ఆధునీకరణకు రూ.37వేల కోట్ల రూపాయలు కావాలి
- సమయాభావానికి అవకాశం లేకుండా డిసెంబరులోగా కొత్త ఈ-టికెటింగ్. దీనిని ఒకేసారి పదిలక్షల మంది వినియోగించుకోవచ్చు
- పర్యాటకుల కోసం ఢిల్లీ స్టేషన్ తరహాలు 7చోట్ల ప్రత్యేక ఏర్పాటు
- ఆరుచోట్ల రైల్ నీరు బాటిలింగ్ ప్లాంట్ల ఏర్పాటు
- కీలక ఘట్టాలైన నగరాలను కలిపేందుకు ఆజాద్ ఎక్స్ప్రెస్. ఆజాద్ ఎక్స్ప్రెస్ రైలులో యువతకు ప్రత్యేక రాయితీ
- మహిళా ప్రత్యేక రైళ్లకు మహిళా భద్రతా సిబ్బంది - పరిశుభ్రత కోసం బయోటాయిటలింగ్ వ్యవస్థ
- ఆహార నాణ్యతకు ఐఎస్ఓ స్థాయి వంటకం
- ప్రయాణీకులకు సదుపాయాలు పెంచాలనే పట్టుదల
- పుణ్యక్షేత్రాలు ఉన్న రైల్వే స్టేషన్ల ఆధునీకీకరణ
- మధ్యప్రదేశ్ మిస్రాలో కోచ్ల ఆధునీకకరణ వర్క్ షాప్ - ఒరిస్సా కలహండిలో రైలు వాగన్ల వర్క్ షాప్
- మణిపూర్ను రైల్వేలో అనుసంధానం
- కత్రా - వైష్ణోదేవీ యాత్రికుల కోసం బస్సు
- రైలులకు ఒకే టిక్కెట్
-1007 మిలియన్ టన్నుల సరుకు రవాణా లక్ష్యం - వంద కోట్ల టన్నులకు పైగా రవాణాతో రష్యా, చైనా, అమెరికాలతో సమానంగా భారత్
- లెవల్ క్రాసింగులో సౌరశక్తి వినియోగం
- వెయ్యి కోట్లతో రైల్వే స్టేషన్ల అభివృద్ధి సంస్థ
- తుక్కు అమ్మకం ద్వారా రూ.4500 కోట్ల సేకరణ లక్ష్యం
- 47వేల బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి చర్యలు
- రైల్వే రక్షణ దళంలో మహిళలకు పదిశాతం రిజర్వేషన్ - ఇనుము, ఖనిజ రవాణా ద్వారా రూ.800 కోట్ల ఆదాయం
- 7చోట్ల రైల్వే కోచ్ల తయారీ కేంద్రాలు, నిర్వహణ కేంద్రాల ఏర్పాటు
- జోనల్ రైల్వేలో ప్రయాణీకుల భద్రతకు హెల్ప్ లైన్లు - రైల్వే ఉద్యోగుల వసతి గృహాల సంఖ్య పెంపు, రూ.300 కోట్లు కేటాయింపు
- రైల్వేకు వచ్చే ఆదాయం అంచనా రూ.1,25,680 - రైల్వేలకు ప్రయాణీకుల ద్వారా వచ్చే ఆదాయం అంచనా రూ.32,500 కోట్లు - రైల్వే భూముల అభివృద్ధి సంస్థకు రూ.1000 కోట్లు
- సౌర, పవన శక్తి వినియోగానికి రైల్వే ఇంధన నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు
- ఆర్థిక శాఖ నుంచి తీసుకున్న రూ.3వేల కోట్ల రుణానికి వడ్డీ చెల్లించాం
- 1500 కిలోమీటర్ల రవాణా ప్రత్యేక కారిడార్ - కొత్తగా 1.52 లక్షల ఉద్యోగాలు భర్తీ - పురస్కారాలు పొందిన ప్రయాణీకులకు
- లెవల్ క్రాసింగ్ కేంద్రాలకు కేంద్రం నుండి అందుతున్న బడ్జెట్ రూ.వెయ్యి కోట్లు - కోచ్ల పరిశుభ్రతకు ప్రత్యేకంగా కాల్ సెంటర్లు
- రైల్వేల్లో దుబారా తగ్గిస్తాం
- రిజర్వేష్, అభివృద్ధి, భద్రత రుసుంపై పునఃసమీక్ష
- 800 కి.మీ. మేర గేజ్ మార్పిడి
- రైల్వే ఛార్జీల సమీక్షకు స్వతంత్ర దర్యాఫ్తు సంస్థ ఏర్పాటు - ప్రయాణీకుల రద్దీ 5.2 శాతం పెరుగుతుందని అంచనా
- డీజిల్ ధర పెంపు వల్ల రూ.3,300 కోట్ల భారం
- కొత్త రైలు మార్గాల ప్రతిపాదన నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం ఉచితంగా స్థలం ఇచ్చేందుకు అంగీకరించింది
- సాధారణ బడ్జెట్ నుండి రైల్వేల కేటాయింపులు రూ.26వేల కోట్లు
- రైల్వేలకు అంతర్గత ఆదాయం 14,260 - 22 కొత్త లైన్లు - తత్కాల్ రిజర్వేన్ల ఛార్జీలు పెంచే ప్రతిపాదన
- కొత్తగా 27 ప్యాసింజర్ రైళ్లు, 67 ఎక్స్ప్రెస్ రైళ్లు, 58 రైళ్ల పొడిగింపు
- క్రీడారంగాల్లో అవార్డులు పొందిన వారికి ప్రత్యేక రాయితీ - కొత్తగా 5 మెము రైళ్లు ఎపికి ఇవే..
- విజయవాడలో కొత్త రైల్ నీరు బాటిలింగ్ ప్లాంట్
- కర్నూలులో రైల్వే వాగన్ వర్క్ షాప్
- విశాఖ స్టేషన్లో ప్రత్యేక సదుపాయాలు, విశాఖలో పర్యాటకులకు ఢిల్లీ తరహా ఏర్పాట్లు, విశాఖలో ఎగ్జిక్యూటివ్ లాంజ్
- కాజీపేటలో నైపుణ్యాల శిక్షణా కేంద్రం
- రైల్వేల్లో ఆర్థిక నిర్వహణ కోసం సికింద్రాబాదులో ప్రత్యేక శిక్షణా కేంద్రం
- సికింద్రాబాదులో రైల్వేల సమీకృత అభివృద్ధి శిక్షణా కేంద్రం కొత్త రైల్వే లైన్లు, ప్రాజెక్టులు కంభం
- ప్రొద్దుటూరు మణుగూరు
- రామగుండం కొండపల్లి
- కొత్తగూడెం రాయ్పూర్
- కాచిగూడ డోర్నకల్
- మిర్యాలగూడ(డబ్లింగ్ ప్రతిపాదన) చిక్బల్లాపూర్
- పుట్టపర్తి మంచిర్యాల
- అదిలాబాద్ మదనపల్లి
- శ్రీనివాసపురం




ఇక ఇ టికెటింగ్ స్పీడే స్పీడు

ఎలకా్ట్రనిక్ రైల్వే టికెట్లు అమ్మే IRCTC ని తవరలో ఆధునీకరిస్తున్నారు.ఇందువల్ల ఒక నిమిషంలో అమ్మే 2000 టికెట్ల సంఖ్య 7200 కి పెరుగుతుంది. ఇపుడు 40 వేల మంది ఒకే సారి టికెట్లు తీసుకుంటూండగా వారి సంఖ్య 1లక్షా 20 వేలకు పెరుగుతుందని బడ్జెట్ ప్రతిపాదనల్లో రైల్వే మంత్రి బన్సాల్ వివరించారు


Monday, February 25, 2013

రైలు ఛార్జీల పెంపు తప్పదు! ఏటా 23 వేలకోట్ల నష్టం

కొత్త రైల్వే బడ్జెట్లో ప్రయాణికులపై మరోమారు భారం మోపేందుకు కేంద్ర రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్ భావిస్తున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి కొత్త రైల్వే బడ్జెట్ను మంగళవారం మంత్రి బన్సల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.

ఈ రైల్వే బడ్జెట్లో సరకు రవాణా ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. అయితే సరకు రవాణా ఛార్జీలతో పాటు ప్యాసింజర్ టిక్కెట్ ఛార్జీలను పెంచుతారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ.. వడ్డన మాత్రం పాక్షింగానైనా ఉంటుందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి.

డీజెల్ ధరలు పెరగడంవల్ల రవాణా ఛార్జీలను పెంచాలన్న తలంపులో మంత్రి ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల చమురు మార్కెటింగ్ కంపెనీలు డీజెల్ ధరలు పెంచడం వల్ల రైల్వేలపై భారం పడింది. జనవరి నుంచి బల్క్ వినియోగదారులపై సబ్సిడీని ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో లీటరు డిజెల్ రూ.10 చొప్పున పెరిగింది. బల్క్ వినియోగదారులపై డీజెల్ ధరలను పెంచడానికి చమురు మార్కెటింగ్ కంపెనీలు సమర్థించుకుంటున్నాయి.

అదే ప్యాసింజర్ ఛార్జీలను పెంచితే రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి . ఇప్పుడు తాజా సరకు రవాణా చేసే వారు కూడా రైల్వేలు సరకు రవాణా ఛార్జీల పెంపుపై ఒక పరిమితి ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్యాసింజర్ టిక్కెట్లపై వస్తున్న నష్టాన్ని తమపై రుద్దడం ఏమిటని వారు నిలదీస్తున్నారు.

పారిశ్రామిక రంగానికి చెందిన లాబీ సీఐఐ కూడా జోక్యం చేసుకుని రైల్వేలు సరకు రవాణా చార్జీలు పెంచాలంటే మూడు నెలలు ముందు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి ఆందోళనల నడుమ ప్రభుత్వం మరోమారు ప్రయాణికులపై భారం పెంచినా పెంచొచ్చు ... లేదా బడ్జెట్లో రైల్వేలకు అదనంగా కేటాయింపులు చేసే అవకాశాలు లేకపోలేదని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలావుండగా, రైల్వేలు ప్యాసింజర్ సర్వీసుల కారణంగా సంవత్సరానికి రూ.23,000 కోట్ల మేరకు నష్టాలను చవిచూస్తోంది.