సామాజికంగా వెనుకబడిన బిసి కులాల మీదే ఆధారపడే ప్రభుత్వాలు నిలదొక్కుకోగల పరిస్ధితి దేశవ్యాప్తంగా విస్తరిస్తోందని తెలగ బలిజ కాపు రిజర్వేషన్ సాధనా సమితి గుంటూరులో ఆదివారం అభిప్రాయపడింది. తమిళనాడు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మొదలైన రాషా్ట్రలే ఇందుకు ఉదాహరణని రాష్ట్రదేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య వివరించారు. ఈ మూడు కులాలను బిసి జాబితాలో చేర్పించే బిసి డిక్లరేషన్ కోసం కృషిచేద్దామని ఆయన అన్నారు.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ విలీనం చేయడానికి ముందు సోనియా గాంధీ వద్ద చిరంజీవి తాను ప్రస్తావించిన అంశాల్లో కాపులను బిసిల్లో చేర్చడం, తెలంగాణా, పోలవరం ప్రాజెక్ట్ వున్నాయన్నారు
తాను అవమానాలతో తెలుగుదేశం పార్టీని వదలలేదని రెండుసార్లు తనకు ఆపార్టీ రాజ్యసభసభ్యత్వమిచ్చి గౌరవించిందని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు
No comments:
Post a Comment