కొనుగోలు శక్తిలో - (మెటో్రలు, రాష్టా్రల రాజధానులుమినహా) దేశంలోనే 10 వస్ధానంలో వున్న తూర్పుగోదావరి జిల్లాలో వేగంగా మారిపోతున్న జీవనశైలి పెద్ద పట్టణం రాజమండ్రిలో బాగా కనబడుతోంది.
వీకెండొస్తేచాలు రిలయన్స్, స్పెన్సర్స, మోర్ లాంటి షాపింగ్ మాల్స్ కిటకిటలాడిపోతూంటాయి. వర్కింగ్ లంచ్ అన్నట్టు అక్కడికక్కడే నిలబడితినేసే 'క్విక్ ఈట్' వ్యాపారమే అసలు వ్యాపారానికి ధీటుగా రిలయన్స్ షాపింగ్ మాల్ లో పెరిగిపోతోంది.
'ఏంటీ ప్లాన్స్'అని ఓ ఇంజనీరింగ్ సూ్టడెంట్ ని ముగ్గురు ఫ్రెండ్స్ అడుగుతున్నపుడు 'సింపుల్ విండో షాపింగ్...ఇక్కడే ఈటింగ్...మ్యాట్నీ...అంతే' ననిచెప్పింది...చాలామంది చిన్నపిల్లలతో వచ్చి కావలసినవి వస్తువులు కొనుక్కుని ఫాస్ట్ ఫుడ్ తినేసి వెళ్ళిపోతున్నారు. మూడేళ్ళ క్రితం వరకూ లంచ్ డిన్నర్లు ఇంట్లోనే స్నాక్స్ మాత్రమే బయట. ఇపుడు మొత్తం సీను మారిపోయింది
60శాతం వరకూ డిస్కౌంట్ అన్న ప్రకటనలు ఒక ఇంట్లో మూడుతరాలవాళ్ళనీ మాల్స్ లోకి ఆకర్షిస్తున్నాయి. వాళ్ళు ఎంతకొన్నారన్న క్వశ్చన్ ని పక్కన పెడితే కొంతైనా తింటారన్నది ఖాయమైపోయింది. వయసు బాగా పైబడిన వాళ్ళే అంత డిసౌ్కంట్ అన్నారు ఇంతే ఇస్తారా అని నిలదీస్తూంటే 'ఆ ఐటమ్ అయిపోయింది మేడమ్' అని అందమైన స్వరంతో తెచ్చిపెట్టుకున్న వినయంతో సేల్స్ గాల్స్ రెస్పాండవుతూవుంటారు
No comments:
Post a Comment