ఫిబ్రవరి 21న తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల నుంచి శాసన మండలికి గ్రాడ్యుయేట్ల ఎన్నికల ప్రక్రియను ఇంటర్ నెట్ ద్వారా కంప్యూటర్లపై చూడటానికి వెబ్ కాస్ట్ చేస్తున్నారు
కాకినాడలోని జెఎన్ టి యు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని జె ఎన్ టి యు, ప్రగతి, ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్ధులు నిర్వహిస్తారు. వీరంతా 20 వతేదీనే పోలింగ్ బృందాలతో ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి కంప్యూటర్లకు బి ఎస్ ఎన్ ఎల్ కనెక్షన్లు అమర్చి ట్రయిల్ వెబ్ కాస్ట్ చూసుకుంటారు. ఇందుకు ఎన్ ఐ సి సంస్ధ టెక్నాలజిని అందజేస్తోంది.
పోలింగ్ కేంద్రాల్ని పారదర్శకంగా చూపించే ఈ వెబ్ కాస్ట్ (ప్రత్యక్ష) ప్రసారంలో ఓటర్ల ప్రయివెసి కి ఎలాంటి సమస్యా వుండదని జె ఎన్ టి యు ప్రతినిధి వివరించారు
No comments:
Post a Comment