"అను" ఈ నెలాఖరుకి రిటైరయిపోతోంది. అనూతోనే ఢిల్లీ పోలీసులు డాగ్ సా్క్వడ్ ప్రారంభించారు. డాబర్ మన్ వంశంలో పుట్టిన అను 7 నెలల పిల్లగా వున్నపుడు 5 వేలరూపాయలకు పోలీసులు కొని పేరుపెట్టారు.
అను చాలా చురుకైనది. ఎన్నో నేరగాళ్ళు రహస్యంగా దాచివుంచిన డ్రగ్స్ ను కనిపెట్టింది. బాంబులను బయటపెట్టింది. క్రిమినల్స్ ను పట్టి అప్పగించింది.59 జాగిలాలున్న సా్క్వడ్ లో అనూకి మాత్రమే 24 గంటలూ ఎక్కడికైనా తిరిగే స్వేచ్ఛ యిచ్చారంటే పోలీసులకు అనూ మీద ఎంత నమ్మకమో అర్ధమౌతుంది
ఎన్నో అందాలపోటీల్లో బహుమతులు గెలుచుకున్న అనూ వయోభారంతో చిక్కపోతోంది. ఆరోగ్యం బాగానే వున్నప్పటికీ పనిచేసేటపుడు రిటైర్ మెంటు కూడా తప్పదు కదా!
11 ఏళ్ళ సర్వీసు చేసిన అనూ మార్చి31న అధికార లాంఛనాలతో రిటైర్ అవుతోందని, ఇకపై అనూ బాధ్యతలు చూసే ఒక స్వచ్ఛంద సంస్ధకు అనూ రిటైర్ మెంటు బెనిఫిట్లు అందుతాయని ఢిల్లీ పోలీస్ అధికారప్రతినిధి ప్రకటించారు
No comments:
Post a Comment