కేంద్ర ప్రణాళికాసంఘం 12 వ పంచవర్ష ప్రణాళిక మీద సంఘ సభ్యులతో "గూగుల్ హాంగౌట్" లో గ్రూప్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.(పూర్ కనెక్టివిటీ వల్లో ఏమో నాకు ఎంటె్రన్స్ దొరకలేదు) సాయంత్రం 5 నుంచి గంటన్నర జరిగిన హాంగౌట్ లో ప్రశ్నలు వ్యాఖ్యానాలు విమర్శలు వచ్చాయని ప్లానింగ్ మీషన్ కృతజ్ఞతలు చెబుతూ ట్విట్టర్ లో రాసింది.
బడ్జెట్ ప్రవేశపెట్టాక చిదంబరంగారు కూడా గూగుల్ హాంగౌట్ గోష్ఠిలో మాట్లాడారు
అంతా బాగానే వుంది...కనెక్టివిటీ (ప్రభుత్వానికి) బాగానే వుంది. సాధారణ అక్షరాస్యతే అంతగాలేని మన దేశంలో టెక్నాలజీని వాడుకోవడమూ బాగానే వుంది.
చివరికినూటఇరవై కోట్ల పైబడిన జనాభాకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు సమావేశాలను కూడా గూగుల్ హాంగౌట్ లో అయిందనిపించెయ్యరు గదా!
No comments:
Post a Comment