ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలను రాష్ట్రశాసన సభ స్పీకర్ ఆమోదిస్తే.... ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మల్సీలకు రావలసిన ఓట్ల సంఖ్యలో మార్పు వస్తుంది
అంతేకాకుండా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ ఏకైక ఎమ్మల్సీ అభ్యర్ధి విజయావకాశాలు వెనక్కి వెళుతాయి
ఇదేసమయంలో అధికార బలాన్ని ఉపయోగించుకుని మంత్రాంగం నడిపితే, రెండో ప్రాధాన్యతా ఓట్లని కూడగట్టుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ తన ఆరవ అభ్యర్ధిని కూడా ఎమ్మెల్సీగా గెలిపించుకోవచ్చు
ప్రతి క్లిష్టసమయంలోనూ ఎలాంటి పటాటోపమూ ప్రచారమూ లేకుండా చాతుర్యంతో గెలుపు మెట్లెక్కుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఆవకాశాన్ని కూడా వాడుకోవాలనే ఆలోచిస్తారు. ఆదే నిర్ణయం రూపుదాలిస్తే ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించబడుతాయి.
ఒక వేళ వ్యూహం బెడిసి కొడితే వై ఎస్ ఆర్ కాంగ్రెస్ కు అది అనుకోని విజయమౌతుంది. కాంగ్రస్ పరువుపోతుంది. ఏవ్యక్తికీ రెండోసారి ముఖ్యమంత్రయ్యే అవకాశంలేని, అదే సమయంలో వెంటనే నాయకత్వాన్ని మార్చే అవకాశంలేని కాంగ్రస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి "తేల్చేసుకోవడమే" బెటరన్నట్టుంటుంది.
పార్టీలో నిష్ఠూరాలూ, హైకమాండ్ వద్ద సంజాయిషీలు ఇచ్చుకోవలసిన పరిస్ధితి కోరితెచ్చుకోవడమెందుకన్న అనుభవం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు వుండనేవుంది.
సంఖ్యాబలం రీత్యా ఐదుగురు ఎమ్మెల్సీలను సునాయాసంగా గెలిపించుకునే అవకాశం దృషా్ట్య ఆమేరకే అభ్యర్ధుల ఎంపికతో కాంగ్రెస్ హైకమాండ్ పని ముగిసింది. ఆరో అభ్యర్ధి విషయంలో నిర్ణయం కిరణ్ కుమార్ రెడ్డి చేసే రిస్క్ నిబట్టే వుంటుంది. ఇందుకు ముందుగా బొత్స ఒప్పుదల ఆతర్వాత "ఢిల్లీ గాడ్ ఫాదర్ల-గో ఎహెడ్" సిగ్నల్ కూడా ముఖ్యమే
కాంగ్రెస్ లో 6వ ఎమ్మెల్సీ అభ్యర్ధిని దింపడం రసవత్తరమైన అఫెన్స్ ఆడటమే!
No comments:
Post a Comment