Thursday, January 24, 2013

రాహులొచ్చె...మొదలాడు!


రాషా్ట్రన్ని విడగొడితే సీమాంధ్రకు, విడగొట్టకపోతే తెలంగాణ కు కోపమొస్తుందని కాంగ్రెస్ పార్టీకి మూడేళ్ళుగా అర్దమౌతూనేవుంది. ఒక డిసెంబరు 9 నాడు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుని ప్రకటించి తరువాత సీమాంధ్ర లాబీయింగ్, వత్తిళ్ళకు లొంగి విషయాన్ని ఇప్పటివరకూ అపరిష్కృతంగా వుంచేసింది.సమస్యని నానబెట్టి ప్రయోజనంలేదని-కనీసం వారమంటే వారంకాదు...నెలంటే నెల కాదని గులానబీ అజాద్ భాష్యం చెప్పడానికి కారణం సీమాంధ్ర వత్తిడి అనిపించడంలేదు.

సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలైనప్పటినుంచీ ప్రధానంగా కోర్ కమిటీ సలహామేరకే నిర్ణయాలు తీసుకుంటున్నారు. మేడమ్ ఆలోచనలకు అనుగుణమైన అంశాలపై కమిటీ సభ్యుల ఏకాభిప్రాయానికి వస్తారు. లేని అంశాలు పెండింగ్ లో వుండిపోతాయి. ఏ ఒక్కరూ దృఢంగా నిలబడి బాధ్యత తీసుకోని పరిస్ధతే కాంగ్రెస్ లో అగ్రస్ధాయి డొల్లతనం.

రాహుల్ గాంధీ 8 ఏళ్ళుగా క్రియాశీలంగానే వున్నా ఆయన విద్యార్ధి, యువజన వ్యవహారాలకే పరిమితమయ్యారు. తెలంగాణా విషయమై హోంమంత్రి షిండే జనవరి 28 గడువుగా సూచించిన నాటికి కాంగ్రెస్ కు ఆదే పార్టీలో రాహుల్ వ్యవహారాలకు సంబంధం లేదు. ఆతరువాతే రాహుల్ పార్టీ ఉపాధ్యక్షుడయ్యారు. నిన్నే కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపధ్యంలోనే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజన యోచనను వ్యతిరేకిస్తూ వత్తిడి పెంచారు

ఈ సమస్యను రాహుల్ కి విడిచిపెట్టడానికే మరికొంత సమయం అవసరమని అజాద్ సూచించారనుకోవలసివస్తోంది

ఉన్న పరిస్ధితిలో వీలైనన్ని మెరుగులు తీసుకురావడమే సోనియావిధానం. ప్రాంతీయ పార్టీలతో పొత్తులు ఇందులో భాగమే. అయితే రాహుల్ గాంధీ 8 ఏళ్ళ అనుభవం నేర్పిన పాఠాలు మరోవిధంగా వున్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ మొదలైన అన్ని రాష్టా్రల్లోనూ కాంగ్రెస్ పొత్తువున్న ప్రాంతీయ పార్టీలు బలపడి కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్ధకమైంది. ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలే కాంగ్రెస్ కు ప్రధాన శత్రువులన్నది రాహుల్ అనుభవం.

మనరాష్ట్రంలో తెలంగాణ ఏర్పడితే టి ఆర్ ఎస్  అవసరం వుండదు. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ కు ఎంతకాలం నిలుస్తుందో తెలియని ఉద్వేగపూరతమైన సానుభూతి తప్ప సిద్ధాంత పునాది,బలాలు ప్రధానంగా లేవు. ఇక గొప్పక్యాడర్ తో సిద్ధాంత పునాదులున్న తెలుగుదేశం పార్టీయే కాంగ్రెస్ కి సమస్యాత్మకం. తెలుగుదేశం బలహీనపడే దిశగా తెలంగాణా సమస్యని పరిష్కరించడం మీద కాంగ్రెస్  ఉపాధ్యక్షుడు దృష్టి పెట్టవచ్చు.

ప్రణబ్ ముఖర్జీ ఆర్ధిక ముంత్రిగా వున్నపుడు ఆయన్న కలుసుకోడానికి రాహుల్ వెళ్ళారు. అక్కడ లిఫ్ట్ పైనుంచి దిగి రావడానికి 3 నిమిషాలు పట్టవచ్చని తెలుసుకున్న రాహుల్ మెట్లెక్కి పైకి వెళ్ళారు. వేచివుండటంలో అసహనం ఏమిటో తెలిసిన రాహుల్ తెలంగాణా సమస్యను వెంటనే బహుశ 28 గడువులోగానే తేల్చేస్తారని ఆశించవచ్చా!

2 comments:

  1. Naveen garu, from where you were able to get the point of Rahul unable to wait for the lift? A good observation made by the writer

    ReplyDelete
    Replies
    1. ఏదో న్యూస్ పోర్టల్ లోనో ఇండియా టుడే లోనో చాలా కాలం క్రితం చదివాను గుర్తు రావడం లేదు అవధాని గారూ

      Delete