Saturday, January 26, 2013

రెండో ఎస్సార్సీ కే రాజమండ్రి ఎంపి ఒకే


 తెలంగాణా సమస్య పరిష్కారానికి రెండో (స్టేట్ రీ ఆర్గనైజేషన్ కమీషన్) ఎస్ ఆర్ సి వేయాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానానికే రాజమండ్రి ఎం పి ఉండవల్లి అరుణ్ కుమార్ కట్టుబడి వున్నారు. శుక్రవారం సభ అనంతరం తనపై వచ్చిన విమర్శలను శనివారం మీడియా సమావేశంలో ఆయన ఖండించారు. టి సమస్యపై విధానమేమిటన్న ప్రశ్నకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయానికే కట్టుబడి వున్నానన్నారు. తాను సభలో చెప్పిన ప్రతీమాటకూ డాక్యుమెంట్ల పరంగా ఆధారాలున్నాయని తాను అన్న మాటల్లో ఏది అసత్యమో చెబితే తప్పు దిద్దుకోగలననీ స్పష్టం ఆయన చేశారు.

వెంటనే తెమలని రెండో ఎస్ ఆర్ సి ప్రతిపాదనను అరుణ్ కుమార్ ముందుకి తీసుకు రావడం ద్వారా టి సమస్య ఇప్పట్లో తేలదన్న సూచన ఇచ్చారనుకోవలసి వస్తోంది.



No comments:

Post a Comment