ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ విశేషాలు
*రాష్ట్రప్రజల తలసరి ఆదాయం 7 ఏళ్ళలో 3 రెట్లు పెరిగి 71 వేలకు చేరుకుందని ఆర్ధిక మంత్రి ప్రకటించారు
*వ్యవసాయ బడ్జెట్ పేరుతో సభను తప్పుదారి పట్టించినందుకు లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్ హక్కుల నోటీసు ఇచ్చారు
*కాంగ్రెస్ హామీలైన 9 గంటల వ్యవసాయ విద్యుత్ తలకు 6 కిలోల బియ్యం ప్రస్తావనే బడ్జెట్ ప్రతిపాదనల్లో లేదు
ప్రజల తలసరి ఆదాయం 77212 రూపాయలకు చేరిందని,ప్రభుత్వ విధానాల వల్ల ఇది సాధ్యమైందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్రబడ్జెట్టుని ఈ రోజు శాసన సభలో ప్రవేశపెడుతూ ప్రకటించారు.
2004 లో తలసరి ఆదాయం 25 వేల రూపాయలుగా ఉండగా ఇప్పుడు అది మూడురెట్లు పెరిగిందని చెప్పారు.
స్థూల ఉత్పత్తి ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్లుగా లెక్కగట్టామన్నారు. ఇది కూడా రెండువేల నాలుగుతో పోల్చితే నాలుగు లక్షల కోట్ల పెరుగుదల ఉందన్నారు.
పారిశ్రామిక ప్రగతిలో పదిన్నర శాతం,సేవల రంగంలో 11.5 శాతం, వ్యవసాయంలో 5.5 శాతం పెరుగుదల ఉందన్నారు.
మంత్రిగారు చెబుతున్న దాని ప్రకారం రాష్ట్రం మంచి పురోగతిలో పయనిస్తోంది. ఇంతటి ప్రగతి వుంటే ప్రజల జీవన ప్రమాణాలుపెరగాలి. కొనుగోలు శక్తులు ఎంతో కొంత పెరగాలి. కానీ అదేమీ కనిపించడం లేదు. అలాగని మంత్రిగారు అబద్దం చెబుతున్నారనుకోలేము
కాకపోతే ప్రగతి ఫలాలన్నీ ప్రజలందరికీ కాక సంపన్న వర్గాలకే అందుతున్నాయనీ, అసలు ప్రయివేటు రంగం సాధించిన ప్రగతినే రాష్ట్రమంతటికీ ఆపాదించి బడ్జెట్ లో చూపించానీ అనుకోవలసి వస్తోంది.
మరోవైపు వ్యవసాయానికి ప్రత్యేకంగా బడ్జెట్ పెడుతున్నామని గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వం సాంకేతికంగా ఇరుకున పడింది.ఏ నిబంధన కింద వ్యవసాయ ప్రణాళికను బడ్జెట్ సమయంలో ప్రవేశపెట్టారని లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయన ప్రశ్నించారు.దీనిపై ఆయన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.
నిబంధనలు అంగీకరించవని తెలిసి కూడా వ్యవసాయ బడ్జెట్పై ప్రబుత్వం ఎందుకు గొప్పులు పోయిందని ఆయన అన్నారు.ఇది ప్రజలను తప్పు దోవ పట్టించడమేనని వ్యవసాయ బడ్జెట్ అంటూ గొప్పలకు పోయిన రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికంగా ఇరుకున పడింది.ఏ నిబంధన కింద వ్యవసాయ ప్రణాళికను బడ్జెట్ సమయంలో ప్రవేశపెట్టారని లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ్ ప్రశ్నించారు.
దీనిపై ఆయన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలైన మనిషికి 6 కిలోల బియ్యం, వ్యవసాయానికి 9 గంటలవిద్యుత్ ప్రస్తావనే బడ్జెట్ లో లేదు. ఈశాసన సభముగిసేలోగా మరో బడ్జెట్ కు అవకాశం లేదు కాబట్టి కాంగ్రస్ ప్రజల కిచ్చిన మాట తప్పినట్టే!
No comments:
Post a Comment