అద్భుతమైన సి్క్రప్ట్ రైటర్ కరుణానిధి తెరముందు కొచ్చి నాటకీయగా రాజకీయాల్లోముఖ్యపాత్ర అందుకున్నారు. డైలాగులనిపించే ఆయన మాటల్లో విజయాల ప్రస్తుతి అజేయాల స్తుతి వుంటాయి. కరుణానిధి వ్యాఖ్యానాల వెనుక ఏదో నిగూఢత వుంటుందని చెన్నై జర్నలిస్టులు పసిగట్టేస్తూవుంటారు.
"సూర్యుడున్నంత వరకూ భూమి మీద జీవరాశుల మనుగడ సాగిపోతూనే వుంటుంది. సూర్యుణ్ణి ఏ ఒక్కరూ సొంతం చేసుకోలేరు. ఆప్రయత్నం చేసిన హనుమంతుడు మూతి కాల్చుకోవడం మనకు తెలుసు" (ఉదయిస్తున్న సూర్యుడు డి ఎం కె చిహ్నం) కరుణానిధి చేసిన ఈ వ్యాఖ్యానాలు మరుసటిరోజే పేపర్లలో వచ్చాయి. ఆరోజే యు పి ఎ కి - డి ఎం కె మద్దతు ఉపసంహరణను కరుణానిధి ప్రకటించారు
2 జి స్పెక్ట్రమ్ కేసులో కేంద్రమంత్రులుగా వున్న రాజాని కుమార్తెనూ అరెస్టు చేసి జైలుకి పంపినప్పటినుంచీ రగిలిపోతున్న ఆగ్రహాన్ని అణచుకున్న కరుణానిధి సమయం చూసి దెబ్బకొట్టారు. "సూర్యుడు" ఎవరి వశమూ కాదని ఓ సంకేతమిచ్చి మరీ యుపిఎ కాళ్ళు విరిచే పనికి పూనుకున్నారు
No comments:
Post a Comment