Friday, March 1, 2013

బడ్జెట్ కు బాబు దూరం?

బడ్జెట్ కు బాబు దూరం?

ఈ నెల 13నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉండాలని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో చేస్తున్న పాదయాత్రను శ్రీకాకుళం వరకు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారని, అందువల్ల బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు ఇంకా ఆరు జిల్లాల్లో పర్యటించాల్సి ఉందని, ఒక్కో జిల్లాలో కనీసం పది రోజుల పాటు పాదయాత్ర చేయాల్సి వుంటుందనిస అంటే మరో రెండు నెలల వరకు ఆయన హైదరాబాద్ వచ్చే ప్రసక్తే వుండకపోవచ్చునని అంటున్నారు. మహానాడు నాటికి పాదయాత్రను ముగించి వీలుంటే హైదరాబాద్లో, లేదంటే ఎక్కడ పాదయాత్ర ముగుస్తుందో అక్కడే పార్టీ మహానాడు నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగే అవకాశాలు కనిపించడం లేదని, సభలో వుండి, ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవడం కన్నా వచ్చే ఎన్నికలకు సన్నద్ధం అయ్యే విధంగా పాదయాత్ర కొనసాగించడమే మంచిదని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు భావిస్తున్నారని పార్టీ నాయకులు అంటున్నారు. తెలంగాణ అంశంపై సభను నడవనివ్వకుండా వివిధ పక్షాల సభ్యులు అడ్డుకునే పరిస్థితి ఉందని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు. చంద్రబాబు బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోతే, ప్రతిపక్ష నాయకుడిగా అలా ఉండడం ఇదే తొలిసారి అవుతుంది.



- Posted using BlogPress from my iPad



No comments:

Post a Comment