Thursday, April 4, 2013

సంజయా దత్ క్షమాభిక్ష తో రేపోమాపోస్వేచ్ఛా జీవి అవుతాడు! అదేకేసులో జైల్లో నిట్టూర్చే జేబురున్నీసా కష్టం మాత్రం ఈ దేశంలో పెద్దవాకికోన్యాయం పేదవాడికోన్యాయం అనే ధ్వంధ్వ నీతికి ఒక సాక్ష్యమై వెక్కిరిస్తూవుంటుంది

సంజయ్ దత్ సరే
జేబురున్నీసా అంతేనా

సంజయ్ దత్ ని క్షమించాలని గవర్నర్ కు 8 విజ్ఞాపనలు అందాయి. ఆ నటుడికి చట్టవిరుద్ధంగా మాఫియా ఆయుధాలు ఇచ్చేముందు వాటిని కొన్ని గంటలు దాచి వుంచిన నేరానికి యావజ్జీవిత జైలు శిక్ష అనుభవిస్తున్న 70 ఏళ్ళు పైబడిన వృద్ధురాలు జేబున్నీసా గురించి ఆలోచించేవారే లేరు.

ఇందుకు తప్పుపట్టవలసింది ఖచ్చితంగా మీడియానే...
సెలబ్రెటీల మీదే ఫోకస్ వుంచడానికి అలవాటు పడిపోయిన సమాచారసాధనాలు పబ్లిక్ ఒపీనియన్ ని రూపొందించడంలో (ఉద్దేశ్యపూర్వకంగా కాకపోయినా) ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయు. నిరుపేదల్ని విస్మరిస్తున్నాయి.

సంజయ్ దత్, జేబురున్నీసాల "నేర" నేపధ్యం 1992 బాబ్రీ విధ్వంసం..ఆతరువాత 253 మందిని చంపి 1000 మందిని గాయపరచిన ముంబై బాంబు పేలుళ్ళు..ఆఅల్లర్ల తరువాత ముస్లింలను శివసేన హింసించినపుడు సంజయ్ దత్ తండ్రి నటుడు, కాంగ్రెస్ నాయకుడు సునీల్ దత్ ప్రాణాలకు తెగించి ముస్లింలను ఆదుకున్నారు.

తండ్రి నుంచి తెగువను గాక నటవారసత్వం మాత్రమే అందుకున్న సంజయ్ ప్రాణభయంతో ఆయుధాలు దగ్గరుంచుకోవాలనుకున్నాడు. సినిమారంగాన్ని చెప్పుచేతల్లో వుంచుకున్న మాఫియా డాన్ దావూద్ తమ్ముడిని అనేక సార్లు స్వయంగా కలసి డీల్ కుదుర్చుకున్నాడు.

అవి ముంబాయిని చీకటి ప్రపంచం రాజ్యమేలినరోజులు. రాజకీయవేత్తలు, సంపన్నులు, వ్యాపారులు, రియల్టర్లు, సినిమారంగం దావూద్ తో పరిచయాన్నే గొప్పగా చాటుకున్న కాలం..చీకటి ప్రపంచపు ప్రాపకంకోసం ఉవ్విళ్ళూరిన వేలమందిలో సంజయ్ ఒకడు మాత్రమే.

దావూద్ తమ్ముడు అనీస్ ఇబ్రహీం ఇంటికి సమీపంలో నివాసముండటమే జేబురున్నీసా చేసిన నేరం..ఐదుగురు ఆడపిల్లలతో సంసారాన్ని ఈడ్చుకొస్తున్న ఈ పేదమహిళ ఇంట్లో ఆయుధాల సంచిని అనీస్ దాచివుంచాడు. ఆసంచినే తరువాత సంజయ్ కి అందజేశారు.

దర్యాప్తులో జేబురున్నీసా మీద సంజయ్ మీదా 'టాడా'కేసులు పెట్టారు.తదుపరి దర్యాప్తులో సంజయ్ వద్ద ఆయుధాలు ఉగ్రవాదుల దాడుల కోసం కాదని అధికారులు నమ్మారు. వారి అభిప్రాయాన్ని కోర్టు ఆమోదించి ఆయన పై టాడా కేసు ఉపసంహరించింది.

ఆదశలో కూడా జేబురున్నీసా ను ఎవరూ పట్టించుకోలేదు. ఆమెవద్ద వుంచిన ఆయుధాల తీవ్రతకూడా ఆమెకు తెలియదు. స్వయంగా ఆమె తీవ్రవాది అయివుంటే వేరే విషయం. అత్యంత ప్రముఖులే మాఫియాకు మోకరిల్లిన (మోకరిల్లుతున్న)కాలంలో ఈ మహిళ వారి ఆయుధాలు దాచివుంచిన నేరానికి టాడా కింద జీవిత ఖైదీగా ఇరుక్కుపోయింది. పేదరికం కారణంగా పట్టించుకునే వారు లేక అక్కడే మగ్గిపోతోంది.

టాడా నుంచి బయట పడిపోవడమే సంజయ్ దత్ కు పెద్ద ఊరట. అక్రమాయుధాల కేసులో ఇంకా మూడున్నర ఏళ్ళ శిక్ష అనుభవించవలసిందేనని కోర్టు స్పష్టంచేశాక ఆయన పరితాప, కోర్టు విధేయతా ప్రకటనలు మొదలవ్వకమందే సంజయ్ కు క్షమాభిక్ష పెట్టాలన్న సన్నాయి రాగాలు కాంగ్రెస్ లోని అత్యున్నత పవర్ కేంద్ బిందువైన రాహుల్ గాంధీ "సొంతమనిషిలా"పరిగణన వున్న దిగ్విజయ్ సింగ్ అందుకున్నారు..అపుడే అర్ధమైపోయింది కొంత తంతు ముగిశాక సంజయ్ కు క్షమాభిక్ష మంజూరౌతుందని. ఏకంగా 8 మంది మహారాష్ట్ర గవర్నర్ కు విజ్ఞాపనలు చేయడంద్వారా ఈ తంతు మొదలు పెట్టేశారు.

అధికారంలో వుండే లెక్కల్లో కూడికలు తీసివేతల లెఖ్ఖల్నేచూసే రాజకీయ ప్రయోజనాల ముందు న్యాయాన్యాయాలు ధర్మాధర్మాలు వెనక్కి పోతాయంటే కొంతఅర్ధం చేసుకోవచ్చు

సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఖట్జూ కూడా స్వయంగా "సంజయ్ క్షమాబిక్ష" క్యాంపెయిన్ ప్రారంభించడమే ఆశ్చర్యం...విచారకరం.

టాడా కేసునుంచి సంజయ్ ని బయట పడెయ్యడానికి సహకరించిన దర్యాప్తు అధికారుల వివరాలు వారి వాంగ్మూలాల్లోనే వుంటాయి. వారందరి మీదా చార్జిషీట్లు వేయడానికి బదులు ఈ కేసులో కూడా రాయితీలకు లాబీయింగ్ చేస్తున్న పెద్దలకు జనం ఏమనుకుంటారన్న సిగ్గులేదు సరే! మనస్సాక్షి కూడా వుండదా?

సంజయా దత్ క్షమాభిక్ష తో రేపోమాపోస్వేచ్ఛా జీవి అవుతాడు! అదేకేసులో జైల్లో నిట్టూర్చే జేబురున్నీసా కష్టం మాత్రం ఈ దేశంలో పెద్దవాకికోన్యాయం పేదవాడికోన్యాయం అనే ధ్వంధ్వ నీతికి ఒక సాక్ష్యమై వెక్కిరిస్తూవుంటుంది

సంజయ్ కుక్షమాభిక్ష దొరుకుతుంది... జేబురున్నీసా మాత్రం జైల్లోనే పెద్దలకో న్యాయం పేదలకో న్యాయంలా నిలుస్తుంది





No comments:

Post a Comment