Saturday, March 16, 2013

*గెలిచినా మైనారిటీలో పడ్డ రాష్ట్ర ప్రభుత్వం! *విప్ ధిక్కారం 9మంది కాంగ్రెస్,6గురు దేశం ఎమ్మెల్యేలపై వేటు? *ముఖ్యమంత్రి భాషా సమస్య - అయోమయపు సమర్ధన

రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ముదుగా అందరూ ఊహించినట్టే వీగిపోయింది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత అసెంబ్లీలో ఓటింగు జరిగింది. సభలో అవిశ్వాసానికి అనుకూలంగా 58 మంది, ప్రతికూలంగా 142 మంది ఓటు వేశారు. ఎం.ఐ.ఎం., లోక్సత్తా ప్రభుత్వాన్ని ఎండకడుతూనే ఓటింగుకు దూరంగా ఉన్నాయి. 90 మంది దూరంగా ఉన్నారు. వీరిలో గైరుహాజరైనవారు 26 మంది. మిగిలిన 64 మంది ఓటింగుకు దూరంగా ఉన్నారు.

అవిశ్వాసతీర్మానాన్ని వ్యతిరేకించడానికీ తన ప్రభుత్వాన్ని సమర్ధించుకోడానికీ ముఖ్యమంత్రి గంటకు పైగా ఇచ్చిన ఉపన్యాసం ఎంత ప్రయత్నించినా అర్ధంకాని అయోమయంగా గందరగోళంగానే మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తెలుగు భాష వచ్చి తీరవలసిన అవసరాన్ని కూడా ఈ అవిశ్వాస తీర్మానం పై చర్చ స్పష్టం చేసింది

మొత్తం 294 మంది సభ్యులు గల శాసనసభలో కాంగ్రెస్ బలం 142గా తేలిపోవడంతో ఇది మైనారిటీ ప్రభుత్వం అని కూడా లెక్కతేలిపోయింది.

విప్లను ధిక్కరించిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలపార్టీ పై చర్యలకు రంగం సిద్ధమైంది.

తొమ్మిది మందిపై శనివారం నాడే స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ నాయకులు స్పష్టంచేయగా, తెలుగేదేశం పార్టీ విప్ను ధిక్కరించినవారి వివరాలను చంద్రబాబు నాయుడు కోరారు.

కాంగ్రెస్ కి చెందిన జోగి రమేష్ అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు. జోగి రమేష్ చేజారుతున్నట్టు శుక్రవారం సాయంత్రంనుంచే సంకేతాలు వెలువడ్డాయి. ఒక దశలో మంత్రి పార్థసారథి ఆయనను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్దకు తీసుకువె ళ్లగా, తాను కాంగ్రెస్తోనే ఉంటానని ఆయన చెప్పినట్టు తెలుస్తున్నది. అయితే చివరికి ఆ క్షణం వచ్చేసరికి ఆయన తీర్మానానికి అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు.

అలాగే రాజీనామా చేసి ,ఉపసంహరించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అవిశ్వాసానికి అనుకూలంగానే ఓటు వేశారు.

ఇంకా గొట్టిపాటి రవి, ఆళ్ల నాని, పేర్ని నాని, సుజయ కృష్ణ రంగారావు, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, రాజేష్, మొత్తం తొమ్మిది మంది తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు.

ఓటింగుకు రాలేనని మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీనుంచి తెలియజేశారు

ముఖ్యమంత్రిపై ఇటీవల నిప్పులు చెరుగుతున్న మాజీ మంత్రి శంకరరావు వీల్ చైర్లో సభకు వచ్చి ప్రభుత్వ విప్కు అనుగుణంగా అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఓటు వేశారు.

ఆరుగురు తెలుగుదేశం తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. బాలనాగిరెడ్డి, సాయిరాజ్, అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, కొడాలి నాని, వనిత. కాగా, హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలాచారి, చిన్నం రామకోటయ్య,

నాగం జనార్ధనరెడ్డి ఓటింగుకు గైరు హాజరయ్యారు.

ఓటింగు జరగడానికి ముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు.


No comments:

Post a Comment