Thursday, January 24, 2013

జగన్ వల్లే రాష్ట్ర విభజన ?


రాషా్ట్రన్ని విడగొడితే హెచ్చు లోక్ సభా స్ధానాలు గెలుచుకోగలమని కాంగ్రెస్ హైకమాండ్ కు తెలంగాణా నాయకులుచెబుతున్నంత గట్టిగా, రాషా్ట్రన్ని కలిపివుంచితే  హెచ్చు సీట్లు ఖాయమని సీమాంధ్ర కాంగ్రస్ పెద్దలు నమ్మించలేక పోతున్నారు.

రాయలసీమలో, కోస్తాంధ్రలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ ను వచ్చే ఎన్నికల్లో నిలువరించడం జరిగేపని కాదని అర్ధం చేసుకున్నాక, సాధ్యమైనంత వరకూ రాజకీయ నష్టాన్ని నివారించుకోడానికే ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్నట్టుంది.

తెలంగాణాలో తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడున్నవ్యతిరేకత చంద్రబాబు పాదయాత్ర తరువాత తగ్గుముఖం పట్టింది. ఇది కూడా కాంగ్రెస్ కు ఇబ్బందే. కెసిఆర్ నికలుపుకోవడం ద్వారా ఈ నష్టాన్ని నివారించుకోవచ్చన్న ఆలోచనల్ని రెండు ప్రాంతాల నాయకులతో రాష్ట్రవ్యవహారాల ఇన్ చార్జ్ ఆజాద్ సూచనగా లీక్ చేయడమే ఇప్పటి వాతావరణానికి తెరతీసింది.

పార్టీ హైకమాండ్ సంభాషణల వెనుక అప్రకటిత నిర్ణయం ఎంత స్పష్టంగా వుందో - సమైఖ్యవాదులైన మంత్రులు జి కె వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, కాసు కృష్ణారెడ్డి డిల్లీలో విలేకరులతో మాట్లాడిన నీరసపు వ్యాఖ్యానాల్లోనే బయట పడిపోయింది

మూడేళ్ళ క్రితమే జరిగిపోయిన విభజన నిర్ణయం సీమాంధ్రనాయకుల ఒత్తిళ్ళ, లాబీయింగ్ లవల్ల ఆగిపోయింది. ఇప్పుడు ఆదే నిర్ణయాన్ని అమలు చేయవలసిన వుండటం , కాలయాపనలో పార్టీకి కలిగిన నష్టం కాంగ్రెస్ కు సీమాంధ్ర నాయకులంటే చిర్రెత్తుకొచ్చే స్ధితి ని సృష్టించింది.

ప్రత్యేకాంధ్ర ఉద్యమం పుట్టిన 35 ఏళ్ళ క్రితమే రాష్ట్ర విడిపోయివుంటే ఈపాటికి రెండు అభివృద్ధి చెందిన తెలుగు రాష్టా్రలు వుండేవి. ఆతర్వాత సీమాంధ్ర ప్రజలుకూడా హైదరాబాద్ నే ఆలంబన చేసుకున్నారు. ఆ ప్రాంతంలో చాలా పట్టణాలు మూడున్నర దశాబ్దాలుగా పాడుబడిపోతున్నాయి.

80 లక్షల మంది వున్న హైదరాబాద్ లో 30 లక్షల మంది సీమాంధ్రులు.వారు స్వస్ధలాలతో నిరంతర సంబంధాలున్నవారే. నాయకులకు తప్ప కాస్మోపాలిటన్  కల్చరున్న భాగ్యనగర ప్రజలకు ప్రాంతాల తేడాలుండవు.భౌగోళికంగా తెలంగాణా మధ్య లోవున్న హైదరాబాద్ సీమాంధ్రకు కూడా రాజధాని గా వుండలేదు.
రాష్ట్రం విడిపోత సీమాంధ్ర అభివృద్ధి ఫోకస్డ్ గా జరుగుతుంది. ఈ పా్రంతపు వనరుల వినియోగం మరింత పెరుగుతుంది









No comments:

Post a Comment